YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా టిడ్కో భవనాలు..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా టిడ్కో భవనాలు..

కాకినాడ, జూలై 11, 
కాండ్రకోట గుర్తుంది కదా... గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతుందంటూ తీవ్ర అలజడి రేగడంతో నెల రోజుల పాటు ఆ గ్రామస్తులు కంటిమీద కునుకులేకుండా ఉన్నారు. అదిగో దెయ్యం అంటే ఇదిగో దెయ్యం అంటూ ఆగ్రామంలో తీవ్ర భయాందోళనల మధ్య ఎవ్వరిని కదిపినా భయపడుతూ దెయ్యం గురించి చెప్పిన వారే కనిపించారు. బోడసకుర్రు టిడ్కో భవనాల సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఫ్లాట్లు పొందిన వారిలో చాలా మందికి సొంత ఇళ్లు ఉన్నందున ఇక్కడకు వచ్చి నివాసం ఉండడం లేదని, అయితే వారు అద్దెలకు ఇవ్వడంతో కొంత మంది ఈ భవనాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అలాగే ఇక్కడ పలు దొంగతనాలు కూడా జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు కూడా ఇక్కడకు వస్తున్నారని అంటున్నారు.. అయితే దెయ్యం తిరుగుతుందన్న పుకార్లు కొందరు సృష్టించినవా లేక నిజంగా అదృశ్య శక్తి తిరుగుతుందా అన్నది తేలాల్సి ఉంది. అక్కడ లక్షల రూపాయలు ఖర్చుచేసి యజ్ఞాలు చేశారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు వచ్చి ఇవి అపోహ మాత్రమే అంటూ మూఢనమ్మకాలను నమ్మవద్దు అంటూ అవగాహన కల్పించారు.. అక్కడ సద్గుమనిగింది.. ఇప్పుడు అటువంటి పరిస్థితే ఓ గ్రామంలో నెలకొంటోంది. రాత్రి అయితే చాలు బయటకు వచ్చేందుకు చాలా భయపడిపోతున్నారు. బాబోయ్‌ దెయ్యం తిరుగుతుందంటూ బెంబేలెత్తిపోతున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వైనతేయకు ఆనుకుని ఉన్న గ్రామమే బోడసకుర్రు.. ఇది 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామం కాగా ఈ గ్రామంలో అమలాపురం పట్టణంలో ఇళ్లు లేని వారి కోసం 2016లో టిడ్కో భవనాలు నిర్మించింది అప్పటి ప్రభుత్వం.. ఈ భవనాలు నిర్మాణాలు పూర్తి అయిన లబ్ధిదారులకు ఇవ్వని క్రమంలో కోవిడ్‌ సమయంలో ఐసోలేషన్‌ వార్డులుగా ఈ భవనాలను ఆరోగ్యశాఖ ద్వారా వినియోగించారు. అప్పట్లో కోనసీమవ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడి ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారిని ఇక్కడికే తరలించి వారికి భోజన, వైద్య సదుపాయాలు కల్పించింది అప్పటి ప్రభుత్వం.. ఆ తరువాత వీటిని లబ్ధిదారులకు అందించింది. అప్పటి నుంచి ఈ టిడ్కో భవనాల్లో ఫ్లాట్‌లు దక్కించుకున్న వారు చాలా మంది అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఇదో చిన్న గ్రామంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ దాదాపు 1000కుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ టిడ్కో భవనాల సముదాయంలో దెయ్యం తిరుగుతందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాత్రి అయితే చాలు ఒంటరిగా బయటకు వచ్చేందుకు తీవ్ర భయపడిపోతున్నారట. టిడ్కో భవనాల్లో దెయ్యం తిరుగుతుందన్న ప్రచారాన్ని అందులో నివసిస్తున్న వారే కొందరు కొట్టి పడేస్తున్నారు. తాము ఇక్కడే ఉంటున్నామని, అర్ధరాత్రిళ్లు ఇంటికి ఒంటరిగా వస్తున్న సందార్భలు చాలానే ఉంటాయని, అయితే అవేమీ ఇక్కడ కనిపించలేదన్నారు ఇక్కడే నివాసం ఉంటున్న బీఎస్పీ నాయకుడు వడ్డి వీరాస్వామి.. తాను ఇటీవలే అమావాస్య రోజున ఒంటరిగా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగానని, అయితే తనకు దెయ్యం కనపడ్డది లేదన్నారు. దెయ్యం ఉంటే కొంతమందికి కనిపిస్తుందన్న వాదన నిజం అయ్యేలా తనకు కనిపించాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.. అయితే ఇక్కడే నివసిస్తున్న కొందరు అయితే రాత్రి వేళల్లో దెయ్యం అరుపులు వినిపిస్తున్నాయని, దెయ్యం తిరుగుతున్న ఆనవాళ్లు తమకు కనిపించాయని ధీమాగా చెబుతున్నారు..

Related Posts