YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ఐదుగురిపై వేటు ఖాయమా...

ఆ ఐదుగురిపై వేటు ఖాయమా...

విజయవాడ, జూలై 11, 
ఏపీ క్యాబినెట్లో మార్పులు తప్పవా? ఓ ఐదుగురు మంత్రుల ఉద్వాసన తప్పదా? వారిపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారా? వారి పనితీరు మారడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పదే పదే పని తీరు మార్చుకోవాలని సూచించినా.. కొందరి తీరు మారకపోవడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. రోజులు లెక్కబెట్టుకోవాలని.. మీ స్థానంలో కొత్త మంత్రులు వస్తారంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఓ ఐదుగురిపై తప్పకుండా వేటు వేస్తారని టాక్ ప్రారంభం అయ్యింది.ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. మిగతా 24 మంది మంత్రుల్లో.. జనసేన నుంచి ముగ్గురు.. బిజెపి నుంచి ఒకరు ఉన్నారు.. టిడిపి నుంచి 19 మంది మంత్రి పదవులు నిర్వర్తిస్తున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబునుక్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా తేలింది. మరోవైపు మరో పదవిని బిజెపి కోరుతోంది. ఇంకోవైపు ఓ ముగ్గురు మంత్రుల పనితీరు బాగాలేదు. మరో ఇద్దరి తీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఐదుగురిని తొలగించి మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం నడుస్తోంది.ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి విషయంలో సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు అనుకున్న స్థాయిలో ఆయన పని చేయడం లేదని తెలుస్తోంది. ఇంకోవైపు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి తీరుపై కూడా అనేక రకాల వివాదాలు ఉన్నాయి. ఆయనను సైతం మారుస్తారని టాక్ ప్రారంభం అయ్యింది. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యవహార శైలి కూడా బాగాలేదని చంద్రబాబుకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆయనను సైతం మార్చేస్తారని తెలుస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఓ నేత మంత్రి పదవి దక్కించుకున్నారు. టిడిపి శ్రేణులను ఆయన పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఓ ఐదుగురు మంత్రులకు పదవి గండం పొంచి ఉందన్నమాట.
ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేపడతారా? మంత్రులను తొలగిస్తారా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. చాలామంది సీనియర్లు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. తమకు మంత్రి పదవి లభిస్తుందని ఆశతో ఉన్నారు. అయితే సామాజిక సమీకరణలతో పాటు రాజకీయ కోణంలో ఆలోచించి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓ పదిమంది వరకు సీనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అనవసరంగా ఇప్పుడు తేనె తుట్టను కదిలించి ఇబ్బందులు తెచ్చుకోవడం ఏమిటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Posts