
హైదరాబాద్, జూలై 11,
భారత దేశంలో యువ టెన్నిస్ ప్లేయర్ గా రాధిక యాదవ్ సుపరిచితురాలు. ఈయన వయసు 25 సంవత్సరాలు. పలు దేశీయ, అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వర్ధమాన క్రీడాకారిణి గా ఎదుగుతోంది. అటువంటి ఈ ప్లేయర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ చేస్తుంది. తన అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. అలాంటి ఈమె తన జీవితంలో దారుణమైన ఘటనను ఎదుర్కొంది. అది తన జీవితాన్ని ముగిస్తుందని కలలో కూడా ఊహించలేదు.రాధిక యాదవ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఆయన తండ్రికి మొదటి నుంచి ఇష్టం లేదు. పైగా ఆమె అలా చేయడం ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇదే విషయంపై అనేక సందర్భాలలో ఆమెతో చెప్పాడు. చర్చించాడు కూడా. సెలబ్రిటీవి సెలబ్రిటీ మాదిరిగానే ఉండాలని.. ఇలా చిల్లర రీల్స్ చేయకూడదని ఆమెను హెచ్చరించాడు. అసలే సెలబ్రిటీ.. ఆపై ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కావడంతో రాధికా యాదవ్ తండ్రి మాటలను పట్టించుకోలేదు. పైగా తనకు నచ్చినట్టుగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం మొదలుపెట్టింది. రీల్స్ చేసింది. చేస్తూనే ఉంది. ఇది ఆమె తండ్రికి ఇబ్బంది కలిగించింది. దీంతో ఆమెను అత్యంత దారుణంగా అంతం చేశాడు. హర్యానా రాష్ట్రంలోని గుర్ గ్రామ్ ప్రాంతంలో ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు.. గాయాల తీవ్రతకు ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గాయాలు విపరీతంగా కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాధిక ఉదంతం పోలీసులకు తెలియడంతో ఆమె తండ్రిని అరెస్టు చేశారు..రాధిక తండ్రి ఆమెను టెన్నిస్ వైపు ప్రోత్సహించినప్పటికీ పూర్తిగా స్వేచ్ఛనిచ్చేవాడు కాదు. టెన్నిస్ లో ప్లేయర్లు వెస్ట్రన్ కాస్ట్యూమ్ ధరిస్తారు. ఆ కాస్ట్యూమ్ ధరించడాన్ని రాధిక తండ్రి తప్పు పట్టేవాడు. అలా ఉండకూడదని ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. తండ్రి వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆమె కొన్ని సందర్భాలలో మాట్లాడటం మానేసింది. చివరికి కొన్ని టోర్నీలకు దూరంగా కూడా ఉంది. సోషల్ మీడియాలో రాధిక యాక్టివ్ గా ఉండడం అతనికి ఇష్టం లేకుండా పోయింది. మొదట్లో రీల్స్ చేయకూడదు అని అన్నాడు దానికి రాధిక ఒప్పుకోలేదు. మరోసారి ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ రాధిక ఒప్పుకోలేదు. చివరికి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. వాస్తవానికి ఒకతండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడాన్ని సభ్య సమాజం జీర్ణించుకోలేకపోతోంది.కూతురు ఎదుగుదల చూసి ఏ తండ్రి అయినా సరే కానీ ఇతడేమో ఇలా వ్యవహరించాడు. రీల్స్ చేస్తే అతనికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం ఆమె ప్రొఫెషనల్ గా టెన్నిస్ ప్లేయర్ పైగా.. ఎన్నో మ్యాచ్ లు ఆడింది . అలాంటి ప్లేయర్ పై కాల్పులు చేపట్టడం అత్యంత దుర్మార్గం. అతడి పైశాచికమైన ప్రవర్తన వల్ల ఓ యువ ప్లేయర్ కన్ను మూసింది. ఇది యావత్ టెన్నిస్ ప్రపంచానికి మాయని మచ్చ అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.