
హైదరాబాద్, జూలై 11,
రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా ఆయన అభిమానుల్లో ఒక చిన్న వెలతి ఉంటుంది. అదేమిటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి, మళ్ళీ వింటేజ్ ప్రభాస్ లుక్స్ ఎప్పుడు తిరిగి వస్తాయి అని ప్రతీ సినిమా విడుదల సమయం లో ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. వాళ్ళ ఆందోళనకు సమాధానం గా రాజా సాబ్ చిత్రం లో ప్రభాస్ లుక్స్ పర్వాలేదు అనిపించాయి కానీ , వింటేజ్ రేంజ్ లో మాత్రం కాదు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గా ఆయన షూటింగ్ సెట్స్ లో తన అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. అలా రీసెంట్ గా ఒక అభిమాని తో కలిసి దిగిన ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది.ఈ ఫోటో లో ప్రభాస్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. ఈ రేంజ్ లుక్స్ అసలు ఊహించలేదని, ప్రస్తుతం ప్రభాస్ లుక్స్ ని చూస్తుంటే బుజ్జిగాడు చిత్రం లోని ప్రభాస్ గుర్తుకు వస్తున్నాడని, ఇలాంటి లుక్స్ తో సినిమా పడితే టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ మరో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతాడని అంటున్నారు. ఇదే లుక్స్ తో ఆయన ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి . ‘స్పిరిట్'( మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. ఈ సెప్టెంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటించబోతుంది. యానిమల్ లో ఈమె సెకండ్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్'చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. రీసెంట్ గానే విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మారుతీ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం లో హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు.