YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉజ్జయిని మహాంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

ఉజ్జయిని మహాంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

సికింద్రాబాద్
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులకు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్  ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం సమర్పించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు ,మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు.
కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ,దేవాదాయ శాఖ కమిషనర్ ,ఇతర అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 26 న గోల్కొండ జగదాంబ తొలి  బోనాలు ప్రారంభమై  జూలై 1 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. ఆదివారం 13 వ తేదీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారు లష్కర్ బోనం సమర్పిస్తారు.  ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్,దేవాదాయ శాఖ,పోలీస్ , జీహెచ్ ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన ప్రజల సహకారం అవసరం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.
ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న లష్కర్ బోనాలు చారిత్రాత్మక మైనవి. ప్రజల మంచికొరకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. గవర్నర్ గారు సతి సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి చరిత్రను పూజారులను అడిగి తెలుసుకున్నారు. 13 న బోనాలు ,14 భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ప్రజల బాగు కోసం ఆషాఢ మాస బోనాలు వేడుకగా జరుపుకోవాలని అన్నారు.

Related Posts