YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీఎం ఇచ్చింది కవర్ పాయింట్ ప్రజెంటేషన్...

సీఎం ఇచ్చింది కవర్ పాయింట్ ప్రజెంటేషన్...

హైదరాబాద్
పీసీ ఘోష్ కమిషన్ కు అదనపు సమాచారం అందించిన అనంతరం మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
కమిషన్ ని కలిసి అదనపు సమాచారం అందించాం. కమిషన్ నిన్న సమయం ఇచ్చారు. నిన్న కేసీఆర్ కి వైద్య పరీక్షలు ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నాను అని కమిషన్ ను రిక్వెస్ట్ చేయగా అంగీకరించారు.  ఇచ్చిన సమయం ప్రకారం, ఈరోజు కమిషన్ ను కలిసి మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందించాం. మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని మా వద్ద ఉన్నంత మేరకు కమిషన్ కు స్పష్టమైన సమాచారం ఇచ్చాం.  మేం ఇప్పుడు ప్రభుత్వంలో లేము. డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం వద్ద ఉంటాయని అన్నారు.
సమాచారం కోసం చీఫ్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెట్రరీ గారికి లేఖ రాసాను. ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్  వంటి సమాచారం కావాలని లేఖల రూపంలో అడిగాను. కాని వారి నుంచి స్పందన రావడం లేదు. మా వద్ద అందుబాటులో ఉన్న సమాచారం క్రోడీకరించి నోట్ రూపంలో ఇవ్వడం జరిగింది. మా సమాచారం అధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమీషన్ కు అందించాం. అంతే కాదు మూడు సార్లు శాసన సభ ఆమోదం కూడా పొందిందని అన్నారు.
ఎప్పుడెప్పుడు జరిగాయి, జరిగిన చర్చ, ఇతర అంశాలను కమిషన్ కు అందించాం. లెజిస్టేచర్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమం అయినటువంటిది. ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలను, మూడు సార్లు అసెంబ్లీ ఆమోదం, చర్చ వివరాలను కమిషన్ కు డాక్యుమెంట్లతో సహా అందించాం.  కమిషన్ ఆన్ గోయింగ్ కనుక ఆ వివరాలు బయట పెట్టలేను. సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా ఆ వివరాలు బయట  పెడతాం. ఇంతకు మించిన వివరాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాకు అడిగినా ఇవ్వడం లేదు. కమిషన్ కు అందించిన సమాచారం మాకు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉండాలనుకుంటే మాకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు. కమిషన్ ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉందని అన్నారు..
అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్...
మొన్న ముఖ్యమంత్రి  ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్. వందలాది మంది ద్రోహులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్. తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్. నీళ్లు వదిలిపెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అజ్ఞానం, అహంకారంతో రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. 299:512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే అబద్దం చెప్పడం సిగ్గుచేటు. తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తల్వకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నీటి వినియోగం కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితం, నీటి పంపకం శాశ్వతమైంది. శాశ్వతంతా పంపిణీకి సంతకాలు పెట్టామని చెప్పడం పచ్చి అబద్దం. ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి, ఉత్తం, కోమటి రెడ్డి వంటి చేతగాని నాయకుల వల్ల, పెదవులు మూసుకోవడం వల్ల 299 మనకు కేటాయించడం జరిగిందని అన్నారు.
అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్దితో నడుచుకో రేవంత్ రెడ్డి. అజ్ఞానం అని రేవంత్ ను బాధతో అంటున్న. గోదావరిలో 1000, కృష్ణలో 500 ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇచ్చిండు. ఇది అజ్ఞానం కాదా. గోదావరిలో మన వాటా 1000 కాదు, 2918 కావాలని కేసీఆర్ అడిగారు. ఇదే విషయం బయట పెడితే నాలుక కరుచుకున్నరు. అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మాత్రమే ఉత్తం కూడా అజ్ఞానిలా మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మన నీటి హక్కుల గురించి తెలవక పోవడం బాధాకరమని అన్నారు.

Related Posts