YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలకలం రేపుతున్న విజయిసాయి ట్వీట్

కలకలం రేపుతున్న విజయిసాయి ట్వీట్

విజయవాడ, జూలై 15, 
నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ రాజకీయం మాత్రం నా నుంచి దూరంగా లేదు" అంటూ అప్పట్లో చిరంజీవి చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు విజయసాయిరెడ్డికి కరెక్ట్‌గా సరిపోతుంది. తనకు ఈ రాజకీయాలు వద్దు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయి ఆరు నెలలు దాటింది. అయినా సరే ఆయనను మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఏదో రూపంలో రాజకీయాల్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైంది. వీటికి తోడు ఆయన చేసిన ట్వీట్ మరింత ఆసక్తిని రేపుతోంది. విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే మాత్రం ఆయన రాజకీయ రంగ పునఃప్రవేశానికి రెడీ అయినట్టు స్పష్టమవుతోంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు ఆయనకి ఉన్న ఆప్షన్స్‌ ఏంటో ఒక్కసారి పరిశీలిస్తే...  విజయసాయిరెడ్డి వైసీపీలోకి రావాలని ఓ వర్గం నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో కూడా విజయసాయి రెడ్డి రీ ఎంట్రీపై చర్చ సాగింది. దీన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీలోకి విజయసాయిరెడ్డి వస్తే ప్రత్యర్థులకు చుక్కలే అంటూ కూడా కొందరు కామెంట్ చేశారు. దీన్ని వ్యతిరేకించిన వాళ్లు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. ఆయన్ని నమ్మే పరిస్థితిలో జగన్ లేడనే వాళ్లు లేకపోలేదు. అయితే వైసీపీ అధినాయకత్వంపై విజయసాయిరెడ్డి ఘాటుగానే విమర్శలు చేశారు. సజ్జల, వైవి సుబ్బారెడ్డిన టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయకపోయినప్పటికీ వారి మాటలు విని తనపై ధ్వేషం పెంచుకున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని మళ్లీ వైసీపీ అక్కున చేర్చుకుంటుందా అనేది అనుమామే. అయితే ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వాళ్లనే జగన్ అక్కున చేర్చుకొని మంత్రిపదవులు ఇచ్చారని వారితో పోల్చుకుంటే విజయసాయిరెడ్డి చాలా బెటర్ అంటున్నారు. బొత్స, ధర్మాన ప్రసాదరావు, వంశీ లాంటి వాళ్లను గుర్తు చేస్తున్నారు.ఒకవేళ విజయసాయిరెడ్డిని జగన్ ఆహ్వానించినా మిగతా నాయకులతో పొసగడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వారిపై విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు వారితో కలిసి పని చేసే పరిస్థితి ఉంటుందా అనేది అనుమానే అంటున్నారు. ఆయన స్థాయికి తగ్గట్టు ఉండదని భవిష్యత్‌లో ఎలాంటి పదవుల్లో కూడా ప్రాధాన్యత ఉండకపోవచ్చనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకే అలాంటి ఆలోచన విజయసాయిరెడ్డి చేయకపోవచ్చని మాట బలంగా వినిపిస్తోంది. రెండో ఆప్షన్ బీజేపీ. విజయసాయిరెడ్డికి బీజేపీ అధినాయకత్వం వద్ద మంచి పలుకుబడే ఉంది. వైసీపీతో పోల్చుకుంటే బీజేపీ నేతలతో ఎలాంటి విభేదాలు లేవు. కేవలం రాష్ట్రంలో టీడీపీ, జనసేన నేతలు మాత్రమే అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి నెల్లూరు బీజేపీ వరకు అందరూ ఆయన్నిఆహ్వానించే వాళ్లే అంటున్నారు. ఉన్న రెండు ఆప్షన్స్‌లో దీనికే విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భగవద్గీత శ్లోకం చెప్పిన విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు హింట్ ఇచ్చారనే వారు ఉన్నారు. ప్రతిపక్షంతోపాటు అన్ని రాజకీయా పార్టీలు రాజధర్మాన్ని పాటించాలనే స్టేట్మెంట్‌తో తన ట్వీట్ ప్రారంభించారు. కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకంతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కర్మలను ఆచరించడంపైనే అధికారము ఉంటుందని వాటి ఫలితాలపై ఉండదని చెప్పుకొచ్చారు. ఆ ఆ ఫలితాలకు కారణం కాకూడదని అలాగనే పనులు చేయకుండా ఉండొద్దని అన్నారు.  ఇది కచ్చితంగా తన పొలిటికల్ రీ ఎంట్రీపై ఇచ్చిన హింటే అంటున్నారు అభిమానులు. ఈ ట్వీట్‌పై మరో వాదన కూడా వినిపిస్తోంది. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని మరోసారి సిట్ పిలిచింది. దానిని ఉద్దేశించే పెట్టి ఉంటారని అంటున్నారు. సిట్ విచారణ ఫలితం ఎలా ఉన్నా సరే నీకు తెలిసింది చెప్పి రావడం ధర్మం అనే యాంగిల్‌లో ఈ ట్వీట్‌ను డీ కోడ్ చేస్తున్నారు మరికొందరు. ఏమైనా సరే విజయసాయిరెడ్డి మాత్రం ఒక్క ట్వీట్‌తో అందరి బుర్రలకు పని చెప్పారు. ఆయన సీఏ బుర్రలో ఏముందో తెలియదు కానీ దాన్ని డీ కోడ్ చేసే పని మాత్రం సోషల్ మీడియాకు ఇతరులకు ఇచ్చేశారు. దీనిపై ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా సిట్ విచారణకు వచ్చినప్పుడు ఆయన చెప్పే విషయాల కోసం మరికొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts