YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ టిక్కెట్లపై 100 వరకు తగ్గింపు

ఆర్టీసీ టిక్కెట్లపై 100 వరకు తగ్గింపు

అనంతపురం, జూలై 15 
ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది.. బస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనంతపురం నుంచి కొన్ని ప్రధాన నగరాలకు వెళ్లే బస్సులు ఛార్జీలను తగ్గించారు. ఈనెల 31 వరకు తగ్గింపు ఛార్జీలు అమల్లో ఉంటాయని.. వెన్నెల ఏసీ, స్లీపర్‌ బస్సుల్లో 20 శాతం, ఇంద్ర బస్సులకు 15 శాతం ఛార్జీలు తగ్గించినట్లు తెలిపారు. అనంతపురం నుంచి హైదరాబాద్, చెన్నై, తిరుపతి, విజయవాడకు ఈ ఛార్జీలు తగ్గించామన్నారు. అనంతపురం నుంచి వెళ్లడంతో పాటుగా తిరుగు ప్రయాణంలో కూడా ఈ ఛార్జీలు వర్తిస్తాయన్నారుతాడిపత్రి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గతంలో బస్ ఛార్జీ రూ.1105 ఉంటే.. తాజాగా ఆ రేటు రూ.884కు తగ్గించారు. అలాగే అనంతపురం నుంచి విజయవాడ వెళ్లేందుకు గతంలో రూ.961 ఉంటే.. తాజాగా రూ.817కు తగ్గించారు. అనంతపురం నుంచి చెన్నైకు గతంలో రూ.832 ఉంటే.. తాజాగా దానిని రూ.708కు తగ్గించారు. అనంతపురం నుంచి తిరుపతికి గతంలో రూ.579 ఉంటే.. తాజాగా ఆ ధరను రూ.493కు తగ్గిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక్కో రూట్‌లో రూ.100 నుంచి రూ.150 వరకు ఛార్జీలను తగ్గించింది ఆర్టీసీప్రైవేటుకు దీటుగా ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకొనే క్రమంలో వెళ్లేందుకు ఛార్జీలను తగ్గించినట్లు ఆర్‌ఎం సుమంత్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢమాసం కావడంతో పెద్దగా ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో.. ఆర్టీసీకి ఆదాయం పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నామన్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఊరట లభించింది అని చెప్పాలి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.అనంతపురం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆయా డిపోల్లో బస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీ బస్సుల్లోనే ఎక్కువశాతం ఛార్జీలను తగ్గించారు. ఆ డిపోలో నుంచి హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు వెళ్లే బస్సుల టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

Related Posts