
హైదరాబాద్
నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళీధర్ రావు ఇంట్లో కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అదుపులో రిటైర్డు ఈఎన్సీ మురళీధర్ రావు వున్నారు. అయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసింది ఏసీబీ. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పని చేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణ. మొత్తం 10 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.