YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తాట తీస్తున్న ఈగల్ టీమ్...

తాట తీస్తున్న ఈగల్ టీమ్...

హైదరాబాద్, జూలై 15, 
వ్యసనం అనేది ఏడూళ్ల ప్రయాణం లాంటిదని వెనకటికి పెద్దలు చెప్పేవారు. అది ఎంత నిజమో మరోసారి తేలింది. భాయ్ బచ్చ ఆగయా అని పోలీసులు మెసేజ్ చేయడమే ఆలస్యం.. 14 మంది దాకా వచ్చారు. వారిలో ఐటీ ఉద్యోగులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. ప్రాపర్టీ మేనేజర్లు కూడా ఉన్నారు. వీరందరిలో నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్న జంట కూడా వచ్చింది. వీరంతా వచ్చింది వారి కేసుల పరిష్కారానికో.. ఇంకోదానికో కాదు.. సమాజం అత్యంత హేయంగా భావించే ఓ పదార్థం కోసం.. అలా పదార్థం కోసం వచ్చి చిక్కిపోయారు. పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు.. తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్రమాలు.. ఆక్రమణలు.. అతిక్రమణలు జరగకుండా హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. ఆక్రమణలకు గురైన చెరువులకు జీవం పోస్తోంది. ఇదే క్రమంలో మత్తు పదార్థాలకు బానిసలై తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చారు. ఈగల్ అనేది తెలంగాణ పోలీసింగ్లో ఒక ప్రత్యేకమైన విభాగం. ఈ విభాగం మఫ్టీ లో పనిచేస్తుంది. మామూలుగా అయితే హైదరాబాద్ నగరంలో పబ్ లు, క్లబ్ లు, రెస్టారెంట్లపై పోలీసులు తరచూ దాడులు చేస్తుంటారు. మత్తు పదార్థాలు స్వీకరించే వారిపై నిఘా పెడతారు. వారికి పరీక్షలు నిర్వహించి అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి డి అడిక్షన్ సెంటర్ కు పంపిస్తారు. మత్తు పదార్థాలు తీసుకున్నారని సమాచారం అందినప్పుడు మాత్రమే పోలీసులు రంగంలోకి దిగుతారు. అయితే రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ అనే వ్యవస్థ ఇందుకు పూర్తి భిన్నమైనది. మత్తు పదార్థాల మూలాలను దెబ్బ కొట్టడానికి ఈ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆశయాల మేరకు ఈ విభాగం పని చేస్తోంది. ముఖ్యంగా మత్తు పదార్థాలను విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించి.. మత్తు పదార్థాల మూలాలను పెకిలించే ప్రయత్నం చేస్తున్నది. అందువల్లే హైదరాబాదులో మత్తు పదార్థాలు ఒక పట్లగా ఇప్పుడు లభ్యం కావడం లేదు. మత్తు పదార్థాల రాకను ప్రభుత్వం తొక్కి పెట్టిన నేపథ్యంలో.. వేరే మార్గాల వైపు అక్రమార్కులు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాలను కూడా తొక్కి పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.హైదరాబాద్ నగరంలో భిన్న వర్గాల ప్రజలు ఉంటారు. భిన్న వ్యాపారాలు కూడా సాగుతుంటాయి. అయితే కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం.. విపరీతమైన మత్తు కోసం చట్ట విరుద్ధమైన పదార్థాలను స్వీకరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈగల్ అనే వ్యవస్థను తెరపైకి తీసుకురావడం వల్ల వీరికి మత్తు పదార్థాల రాక ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నవారికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. హైదరాబాదులో మత్తు పదార్థాల వినియోగదారులను పక్కా స్కెచ్ తో ఈగల్ సభ్యులు పట్టుకున్నారు. ఇటీవల ఈగల్ సభ్యులు నిర్వహించిన ఓ ఆపరేషన్లో సందీప్ అనే మత్తు పదార్థాల డీలర్ అరెస్ట్ అయ్యాడు. అతని ఫోన్లో ఉన్న 100 మందికి పోలీసులు భాయ్ బచ్చ ఆగయా అనే పేరుతో మెసేజ్ చేశారు. దీంతో రెండు గంటల్లో 14 మంది పోలీసులు చెప్పిన లొకేషన్ కు వచ్చారు. ఇందులో భిన్న వర్గాల ప్రజలు ఉన్నారు. ఓ జంట తమ నాలుగు సంవత్సరాల కుమారుడితో పోలీసులు చెప్పిన లొకేషన్ కు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పోలీసులు నిర్వహించిన పరీక్షలలో వారందరూ మత్తు పదార్థాలు తీసుకున్నట్టు తేలింది. దీంతో వారందరినీ డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఇటీవల ఈగల్ ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సందీప్ అనే డీలర్ దొరికిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. తద్వారా అతడు చెప్పిన వివరాల ఆధారంగా మత్తు పదార్థాలు విక్రయించే వ్యక్తులపైన ఉక్కు పాదం మోపుతున్నారు. అంతేకాదు మత్తు పదార్థాలు కొనుగోలు చేసే వారిపై కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. దీంతో ఈగల్ అంటే హడల్ ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థ పట్ల ప్రజలకు సదాభిప్రాయం కలుగుతోంది

Related Posts