YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిర్లక్ష్యంపై నిలదీస్తాం

నిర్లక్ష్యంపై నిలదీస్తాం

ఢిల్లీలో 17న జరగనున్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్, చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. తొలుత 16వ తేదీన నీతి ఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ రోజున రంజాన్ పర్వదినం రానుండటంతో, వాయిదా వేయాలని పలు రాష్ట్రాల సీఎంలు కోరినందున సమావేశాన్ని ఒక రోజు పోస్ట్ పోన్ చేశారు. ఎన్డీయే నుంచి తెగ‌తెంపులు చేసుకున్నాక‌.. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ వారిద్ద‌రూ ఒకే వేదిక‌పైకి రాబోతున్న తొలి సంద‌ర్భం ఇదే. ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్రాన్ని నిల‌దీసేందుకు వినియోగించుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నవ్యాంధ్రకు నిధుల కేటాయింపులో సాగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని, దీనికి సరైన వేదిక నీతి ఆయోగేనని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు సైతం ఇదే భావిస్తున్నారు. వీరంతా కేంద్రప్రభుత్వ ధోరణి, ఆర్ధిక సహకారంపై పక్షపాత వైఖరులను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర సహకారం పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో ఆధారాలతో సహా వివరించాలని ముఖ్యమంత్రి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. 

 

రాష్ట్రాభివృద్ధి అంటే దేశాభివృద్ధిలో భాగమే. కేంద్రం సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించి ఎదుగుతున్న రాష్ట్రాలకు అండగా నిలవాలి. అవరోధాలు, ఆటంకాలు తట్టుకుని సుస్థిరాభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలే తప్ప కక్ష సాధింపు ధోరణితో ఉండటం సరికాదు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సినవే అడుగుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టంచేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో నవ్యాంధ్రపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తామని తేల్చిచెప్తున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రానికి రావాల్సినవే అడుగుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. కేంద్రం 9 విద్యాసంస్థలను ప్రారంభించి రూ.638కోట్లు మాత్రమే ఇచ్చిందని వాస్తవానికి రూ.11,673 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.1892 కోట్లను చెల్లించాల్సిన విషయాన్ని గుర్తుచేశారు. నవ్యాంధ్రపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉందో గణాంకాలతో సహా వివరించారు చంద్రబాబు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి కేంద్రం కేవలం రూ.428 కోట్లే ఇచ్చింది. అదే బుందేల్‌ఖండ్‌కు మాత్రం రూ.4 వేల కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ పక్షపాత ధోరణిని నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో నిలదీసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.

Related Posts