
ఈ ఏడాది ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్‌తో పాటు తన బ్రాండ్ విలువను పెంచుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో విలువైన బ్రాండ్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్ అధిగమించినట్లు తెలిసింది. బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్ బ్రాండ్ విలువ రూ. 445కోట్లకు పైగా చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.425కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.