YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్... నీ టాలెంట్ సూపర్...

లోకేష్... నీ టాలెంట్ సూపర్...

ఏలూరు, జూలై 21 , 
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల్లో ఏపీలో సౌరశక్తి, మైక్రో ఇరిగేషన్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మహీంద్రా గ్రూప్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈవీ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్‌ తయారీ రంగాల్లో పెట్టుబడులకు రాయితీలు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నారా లోకేష్.. టాప్ ఇండస్ట్రిలియస్ట్స్‌తో టచ్ లో ఉండేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహింద్రా గ్రూపు తమ కంపెనీకి సంబంధించిన ఓ ప్రకటనను తెలుగులో రూపొందించింది. ఒక్క నిర్ణయం చాలు...మీ విధి మీ చేతుల్లో ఉంది.  ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి అని ఆనంద్ మహింద్రా తన సోషల్ మీడియా అకౌంట్‌లో దాన్ని షేర్ చేశారు. ఆ ప్రకటనపై నారా లోకేష్ స్పందించారు. తెలుగు ప్రకటన చాలా నచ్చింది సార్. మీ వాహనాలకు ఏపీ పెద్ద మార్కెట్. ఏపీలో అధునాతన ఆటోమోటివ్ ఎకో సిస్టమ్, పెద్ద మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సన్ రైజ్ స్టేట్ అయిన   ఆంధ్రప్రదేశ్‌లో  మహీంద్రా ప్లాంట్ ను ప్రారంభించాలని కోరారు. ఏపీకి వస్తే.. ఉన్న అవకాశాలను తెలియచేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.   లోకేష్ ఆఫర్ పై ఆనంద్ మహింద్రా కూడా వెంటనే స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని.. ఏపీ జర్నీలో తాము కూడా భాగం అవుతామన్నారు. వివిధ రంగాల్లో కలిసి పని చేసేందుకు తమ బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయన్నారు.  సోలార్, మైక్రో ఇరిగేషన్, టూరిజంవంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామన్నారు.   మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది...ముందు ఏమి ఉందో చూద్దామని తెలుగులో రిప్లై ఇచ్చారు. ఈ వారంలోనే నారా లోకేష్ కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ భూ సేకరణను అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో వెంటనే లోకేష్ స్పందించారు. తమ వద్ద భూమి అందుబాటులో ఉందని..  రావాలని ఏరో కంపెనీలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో కర్ణాటక పరిశ్రమల మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది. తాము భూసేకరణనుక్యాన్సిల్ చేశాం కానీ ఏరో స్పేస్ పార్క్ ని కాదన్నారు.  తమ వద్ద మంచి ఎకోసిస్టం ఉందన్నారు.     ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆనంద్‌ మహీంద్రా ఆసక్తి చూపడంతో..నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం కలిసి పనిచేద్దాం. ఈవీ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్‌ తయారీ రంగాల్లోకి మీ సంస్థను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇవ్వనుంది. మీరు వీటి తయారీకి ఏపీని ఎంచుకుంటేసంతోషిస్తాం’ అని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దిర మధ్య జరిగిన చిట్ చాట్ ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఒక్క పోస్ట్‌తో లోకేష్.. ఆనంద్ మహీంద్రాను ఒప్పించడం గ్రేట్ అంటున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనాలు.  

Related Posts