
సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజి రోడ్డులో ఉన్న సాయి సంతోషి జువెలరీ షాప్ లో భారీ దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్ సహాయంతో మెయిన్ షెటర్ కట్ చేసి. మరోవైపు వెనుక నుంచి బాత్రూంకు రంధ్రం చేసి ఏకంగా 18 కేజీల బంగారు నగలను దొంగలు దోచుకెళ్ళారు. ఉదయం షాప్ ఓపెన్ చేసే సమయంలో గ్యాస్ కట్టర్ తో షట్టర్ కట్ చేసి ఉండటం, బంగారం దుకాణం అంతా నగల స్థానంలో ఖాళీగా ఉండడం, బాత్రూంలో గోడకు రంధరం చేసి ఉండటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సూర్యాపేట పట్టణ పోలీసులు, క్లూస్ టీమ్ లు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాదాపు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఇతర వస్తువులు భారీ చోరీకి గురి కావడంతో.. నగల దుకాణం వ్యాపారి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.