
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఈ నెల 15న నిర్వహించిన యోయో టెస్టులో రాయుడు విఫలమైనట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. రాయుడు స్థానాన్ని స్టార్ ఆటగాడు సురేశ్ రైనాతో భర్తీ చేయనున్నట్టు తెలిపింది. జూలై 3 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.