
మేడ్చల్
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి,తండా 2 లో ఉన్న రాంకీ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. చెత్త ను డంప్ చేస్తున్న సమయంలో కంపెనీలోని కెమికల్ వేస్టేజ్ రియాక్ట్ అవ్వడం తో మంటలు చెలరేగాయి. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. చెత్తకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటన లో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు .