
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు రష్యా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ‘ఉగ్ర’ ముప్పు పొంచి ఉండవచ్చని ఆదేశాన్ని అమెరికా హెచ్చరించింది. ఫిఫా మ్యాచ్‌లు చూడటానికి వెళ్లే అమెరికన్లు దీనిపై ఒకసారి ఆలోచించాలని అగ్రరాజ్యం సూచించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ప్రపంచకప్ జరిగినన్ని రోజులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని , ముఖ్యంగా సెమీ ఫైనల్స్, ఫైనల్స్, ముగింపు ఉత్సవం నాడు పెద్ద మొత్తంలో అభిమానులొస్తారని వారి భద్రతకు రష్యా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది.