
నూజివీడు
దత్తత గ్రామం ముక్కొళ్ళుపాడు లో మాజీ ఐయేఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పర్యటించారు. గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసిపి గుండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అని నిలదీసారు. ముక్కొళ్ళుపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్ ను తొలగించేందుకు గ్రామ ఉపసర్పంచ్ కలగర శివసాయి ప్రయత్నించాడని ఆరోపించారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలపై దాడులకు తెగపడుతున్న శివ సాయిపై నూజివీడు రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారు. బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తామని బెదిరించడంతోపాటు దాడిచేసి చెయ్యి విరగొట్టారు. డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకున్నాడన్న కారణంగా ఆటో డ్రైవర్ పై దాడి చేస్తే, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వైసీపీ నుండి టిడిపిలోకి మారి మళ్లీ వాళ్లే పెత్తనం చెలాయిస్తున్నారు. వైసిపి గుండాలు చేస్తున్న అరాచకాలు మంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెళుతుందని భావిస్తున్నాను. వైసిపి గుండాలు చేస్తున్న అరాచకాలను పోలీసులు అరికట్టకపోతే, గ్రామస్తులే తగిన గుణపాఠం చెప్పవలసివస్తుందని.