
హైదరాబాద్, జూలై 24,
డాలర్ డ్రీమ్ ఎంతో మంది భారతీయులను అమెరికా బాట పట్టించింది. లక్షల మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం వరకు వీరి జీవితం సాఫీగా సాగిపోతూ వచ్చింది. కానీ, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టారో.. మరుక్షణం నుంచి అమెరికాలో ఉంటున్న భారతీయులతోపాటు విదేశీయులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అక్రమంగా ఉంటున్నారని వేల మందిని గుర్తించి స్వదేశాలకు పంపించింది. వీసాలపై ఆంక్షలు పెట్టింది. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. పాలస్తీనాకు మద్దతు తెలిపేవారి వీసాలు రద్దు చేసింది. మొత్తంగా ట్రంప్ రాక.. అమెరికాలోని విదేశీయుల డారల్ కలను చెరిపేస్తోంది. తాజాగా హెచ్–1బీ వీసాల ఎక్స్‌టెన్షన్ కోసం కూడా పడరాని పాట్లు పడుతున్నారు.యూఎస్‌సీఐఎస్ నిబంధనల ప్రకారం.. 240 రోజుల తర్వాత హెచ్–1బీ వీసా అనుమతి ఆగిపోతుంది. ఇది కార్మికులను ఆర్థిక, మానసిక ఒత్తిడిలోకి నెట్టింది.హెచ్–1బీ వీసా గరిష్టంగా ఆరేళ్లు చెల్లుబాటవుతు8ంది. అయితే పీఈఆర్‌ఎం అప్లికేషన్ ఏడాదిగా పెండింగ్‌లో ఉంటే ఆ ఉద్యోగులు ఎక్స్‌టెన్షన్‌కు అర్హులవుతారు. కానీ ఎక్స్‌టెన్షన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత 240 రోజుల తర్వాత యూఎస్‌సీఐఎస్ నిబంధనల ప్రకారం.. పని చేయడం ఆపేయాలి. అయితే దేశంలో ఉండొచ్చు. ఈ నిబంధన కార్మికులకు ఇబ్బందిగా మారుతోంది. ఆర్థిక ఇబ్బందులు మొదలవుతున్నాయి. రెన్యూవల్‌లో జాప్యం, స్పష్టత లేకపోవడం ఖాళీగా ఉండేని పరిస్థితి తీసుకొస్తుంది. ఆదాయం లేక నష్టపోవడమే కాకుండా మానసిక ఒత్తిడితో పోరాడుతున్నారు. అమెరికాలో స్థిరపడి, పన్నులు చెల్లిస్తూ, చట్టాలను పాటిస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ ఖాళీగా ఉండడం కెరీర్‌ను స్తంభింపజేస్తుంది.వీసా రెన్యువల్‌కు అనుమతి పొంది 365 రోజులు దాటిన తర్వాత ఐ–140 దరఖాస్తు కార్మికులు ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా వేగంగా ఎక్స్‌టెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సమయంలోనూ పనిలేకుండా ఉండాల్సిందే. ఇది ఆర్థికంగా ప్రీమియం ప్రాసెసింగ్ అందుబాటులోకి వచ్చే వరకు ఎటువంటి ఉపశమనం లేదు. ప్రయాణం చేయవద్దు, పని చేయవద్దు, ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. గ్రేస్ పీరియడ్ లేకపోవడం కార్మికులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది.