
హైదరాబాద్, జూలై 24,
ఇద్దరు బీజేపీ నేతల పంచాయితీ చివరకు ఢిల్లీ పెద్దల వద్దకు చేరింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హుజురాబాద్ పర్యటనలో భాగంగా చేసిన కామెంట్స్ ఈటల వర్గాన్ని మనస్తాపానికి గురిచేయడం. అక్కడి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజీనామా చేయడం. ఈటల వర్గం లోని నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ శామీర్పేటలో ఈటల నివాసంలో ఆయన్ను కలవడం, వారి బాధలను వ్యక్తం చేయడంతోపాటు బండి తో పాటు హుజురాబాద్ బీజేపీ నాయకుడు కృష్ణారెడ్డిపై ఆరోపణలు చేస్తూ ప్రసంగించడంతో పాటు, ఎంపీ బండి, ప్రస్తుత హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరిందని, ఈటలను పార్టీ నుంచి బయటికి పంపిస్తా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారని, సోషల్ మీడియాలో ఈటలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఒక్కరొక్కరు తమకు తోచిన విధంగా ఆయన ముందు మాట్లాడారు. అలాగే కొంతమంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారి పరిస్తితి, బీజేపీ లో చేరిన తర్వాత ఉన్న పరిస్థితి నీ భేరిజువేసుకొని మాట్లాడం గమనార్హం. అందరి ప్రసంగాల్ అనంతరం మాట్లాడిన ఈటల పరోక్షంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి వాడివేడి గా విరుచుకుపడ్డారు. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎపిసోడ్ సంచలనం సృష్టించింది.ఈ ఎపిసోడ్ పై ఎంత రాద్దాంతం జరుగుతున్నా ఆ విషయంపై ఎవరు కామెంట్ చేయొద్దని బండి తన అనుచర వర్గానికి సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంటే పార్టీ పెద్దలు ఈ విషయంపై దృష్టిసారించారని, ఒకవేళ తమవైపు నుంచి తప్పుగా మాట్లాడితే ఇబ్బంది అవుతుందని ముందే గ్రహించిన ఆయన అందుకు అనుగుణంగా త పార్టీ నాయకులను ముందే హెచ్చరించినట్లు భావిస్తున్నారు. అయితేబండి వర్గంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు, నేతలు సైతం ఈ టాపిక్ పై మాట్లాడేందుకు నిరాకరించడంతో పార్టీ అధిష్టానం వారికి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీలతో కలిసి తన నివాసంలో విందు ఏర్పాటు చేసిన సందర్భంగా వారు మాట్లాడుకున్న విషయాల్లో బండి, ఈటల వ్యవహారం చర్చకు రాలేదని, ఆ విషయం తన పరిధిలో లేదని మీడియాకు చెప్పడం, ఆ విషయంపై పెదవి విప్పేందుకు కూడా అయిష్టత వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఈ విందుకు కేంద్ర మంత్రులిద్దరూ బండి సంజయ్, కిషన్ రెడ్డి హాజరు కాలేదు. అది కూడా మీడియాలో చర్చకు దారితీసింది.అయితే ఈటల, బండి వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు చేస్తూ ఇరువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు కూడా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల తన అనుచర గనంతో మాట్లాడినప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్యానించడం తో ఈ వాదనకు బలం చేకూరింది. అయితే వీరిద్దరు అధిష్టానానికి ఏ అంశాలపై ఫిర్యాదు చేశారో ఇదమిత్థంగా తెలియకపోయినా, కొంతమంది విశ్లేషకులు ఆ ఫిర్యాదులను తాము చదివినట్లు, తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పడం విశేషం. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, అసంతృప్తిని వ్యక్తం చేయడం లాంటి విషయాలన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతారు. ఆ విషయాలు బయటికి వస్తే పార్టీ ఇమేజ్ మరింత దెబ్బతింటుందని అందుకే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. మీడియాకు లీక్ లు ఇవ్వడం కూడా బీజేపీ లో వ్యూహాత్మకమే. పార్టీ అధిష్టానం ఈ విషయంలో చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. అవసరమైన పక్షంలో ఎంతటి వారినైనా పార్టీ బయటికి పంపించేందుకు వెనుకాడరు. అయితే వీరిరువురి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివేదిక తీసుకొని చర్చించిన పిదప అధిష్టానం నిర్ణయం ఉంటుంది. ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఏమైనా పొరపొచ్చాలున్నా, అధిష్టానం మాత్రమే వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు పూనుకుంటుంది. పార్టీలో వేరే నాయకులు ఈ విషయంపై మాట్లాడితే పార్టీ సహించదనే విషయం తెలిసిందే. అయితే అధిష్టానం ఎప్పుడూ, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. స్తానిక సంస్థల ఎన్నికలో పార్టీ కార్యకర్తలను గెలిపించుకునే ఈ సమయంలో గొడవ పడడం విషయంలో పార్టీ సీరియస్ గా స్పందించ కన్నా, సంయమనంతో వ్యవహరించాలని, అందరిని కాపుకుపోవాలని మాత్రమే సూచిస్తారని అభిప్రాయం వ్యక్తమవుతుంది.బీజేపీ లో జరుగుతున్న అంతర్యుద్ధం మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తలదూర్చారు.ఈ ఎపిసోడ్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. శామీర్ పేటలో ఈటల మాట్లాడిన మాటలను కోడ్ చేస్తూ కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఈటల ను విమర్శించడం, ఈటల వెంట ఉన్న వారిపై సానుభూతి ప్రదర్శిస్తూ వారిని తిరిగి బిఆర్ఎస్ లో చేరాలని, వారి కోసం పార్టీ ద్వారాలు ఎప్పుడూ తేరుకునే ఉంటాయని స్పందించడంతో మరో కొత్త ఎపిసోడ్ కు తెరలేపారు. ఈటల సమావేశంలో కొంతమంది నాయకులు బిఆర్ఎస్ ను అక్కున చేర్చుకుంటూ మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్నప్పుడే తమకు మంచిగా ఉండేదని మాట్లాడడం కూడా కారణం కావచ్చు. అయితే ప్రస్తుతం కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టేందుకు ఈటల వర్గంలో ఒక్కరు ముందుకు రాకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సమయంలో ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.