
మహబూబ్ నగర్ జూలై 24,
నాగర్ కర్నూల్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు సీఎం పోస్టు మినహా అన్ని పదవులు అనుభవించిన దిగ్గజం. అలాంటాయన రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి డిసైడ్ అయ్యారంట. ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన ఆయన.. తర్వాత పరిణామాలతో తీసుకున్న ఒక్క నిర్ణయంతో అధ:పాతళానికి వెళిపోయారు. నాటి నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాగంకు రాజకీయంగా ఏదీ కలిసి రాలేదు. ఇఫ్పుడు వైరాగ్యంతో రాజకీయాలకు రిటర్న్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారంట.. తన స్థానంలో వారసుడ్ని తీసుకొచ్చేందుకు పొలిటికల్ కోచింగ్ మొదలుపెట్టారంట.. ఇంతకీ నాగం వారసుడు ఎవరు? నాగర్‌కర్నూల్ పేరు చెప్తే గుర్తుకొచ్చే నాగం జనార్ధన్‌రెడ్డి. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే నాగం అంటే.. నాగర్ కర్నూల్ అంటే నాగం అన్న రీతిలో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగారు నాగం జనార్ధనరెడ్డి. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో నెంబరు టూగా ఉమ్మడి రాష్ట్రంలో గట్టిగానే చక్రం తిప్పారు ఆ సీనియర్ నాయకుడు. సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పనిచేసి చరిత్ర ఆయన సొంతం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు నాగం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడుమంత్రిగా పనిచేసిన నాగం జనార్థన్ రెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాదించారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీకి రాజీనామా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్లో తనపై దాడి తర్వాత తెలంగాణా కోసం టిడిపి అధినేతతో విభేదించి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన రాజీనామా ఆమోదింప చేసుకోవడం కోసం అసెంబ్లీలో అప్పట్లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ క్రమంలో తెలంగాణా నగారా స్థాపించి తెలంగాణా కోసం బలిదానాలు వద్దు కొట్లాడి తెచ్చుకుందామంటూ భరోసా యాత్ర నిర్వహించారు. తిరిగి నాగర్ కర్నూల్ ఉప ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు సముచిత ప్రాధాన్యత కల్పించింది. నాగంతో పాటు కుమారుడికి టికెట్ ఇచ్చిన బీజేపీ. నాగం జనార్ధనరెడ్డికి 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కేటాయించిన బీజేపీ ఆయన కుమారుడు నాగం శశిధర్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఇద్దరు పరాజయం పాలవ్వడంతో రాజకీయంగా ఆయన పతనం ప్రారంభమైందన్న అభిప్రాయం ఉంది. అయితే తర్వాత బీజేపీలో ఇమడలేక 2018 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యారు. నాగం జనార్ధన్ రెడ్డి 2023 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబరు 31న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. తన స్థానంలో కుమారుడ్ని తీసుకురావడానికి నాగం సన్నాహాలు. వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో నాగం జనార్ధనరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన కుమారుడిని తన ప్లేస్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారంట.. నాగం వారసుడు శశిధర్‌రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దాంతో డైరెక్ట్ ఎమ్మెల్యేగా కాకుండా లోకల్ లెవెల్ లో కుమారుడు పట్టు సాధిస్తే ఎమ్మెల్యేగా గెలవడం సునాయాసంగా అయితుందని నాగం భావిస్తున్నారంట. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నాగం శశిధర్ రెడ్డిని రంగాల్లోకి దింపేందుకు గ్రౌండ్ లెవెల్ లో సెట్ చేస్తున్నారట నాగం.. కౌన్సిలర్ గా గెలుపొందితే మున్సిపల్ చైర్మన్‌గా తన కుమారుని కూర్చోబెట్టడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారంట.. నాగర్ కర్నూల్ మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవడానికే ఈసారి గులాబీ పార్టీ తరపున మున్సిపల్ ఎలక్షన్స్ భారం అంతా నాగం జనార్ధన్ రెడ్డే చూసుకుంటున్నారంట. మర్రి జనార్ధన్‌రెడ్డితో అండర్ స్టాండింగ్‌కు వచ్చిన నాగం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పోటీ చేశారు.. ఆయన స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.. అనంతరం నియోజకవర్గంలో పర్యటనలు, పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల వరకు తన వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారంట.. ఆ క్రమంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున అభ్యర్థులను దింపేందుకు నాగం ,మర్రి ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చారంటున్నారు. నాగర్ కర్నూల్ లో ఉన్న 24 వార్డులో సగం టికెట్ల మర్రి జనార్ధన్ రెడ్డి అనుచరులకు , సగం నాగం జనార్ధన్ రెడ్డి అనుచరులకు ఇచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారం