
మచిలీపట్నం
మచిలీపట్నంలోని రేవతి థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. సహనం నశించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పరిమితికి మించి ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వడం ఘటనకు దారి తీసింది. పవన్ ఫ్యాన్స్ థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేసారు. ఒకరి పై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వాటర్ క్యాన్లతో ఫైటింగ్ చేసుకున్నారు.