
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనీ, వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలనీ, కాళేళ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే నీతిఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ రైతుబంధు సహా పలు తెలంగాణ ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు, వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.