
ఇటీవల బీసీసీఐ వరుసగా ఈ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లందరికీ యో యో ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే జట్టుకు ఎంపికైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు యో యో ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఆదివారం యో యో టెస్టుకు హజరుకానున్నాడు. ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీతో పాటుగానే రోహిత్ శర్మ కూడా ఈ టెస్టుకు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాల రీత్యా అతను ఆ రోజు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ రోజు హాజరు కానున్నట్లు తెలిసింది.