
ఇంగ్లాండ్‌లో జరగనున్న 2019ప్రపంచకప్‌కే అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంచలనాల అఫ్గానిస్థాన్ పెద్ద ఫార్మాట్‌లోకి వచ్చేసరికి తేలిపోయింది. బంతితో ఆకట్టుకున్నట్లు కనిపించినా, బ్యాAటింగ్ విషయంలో మాత్రం తడబడింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ కూడా ఇవ్వలేక రెండు సార్లు ఆలౌటై, 262పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. అప్పటివరకూ ఐపీఎల్, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న యువ బౌలర్ రషీద్ ఖాన్ టెస్టులకొచ్చే సరికి లయ తప్పాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ అఫ్గానిస్థాన్ టెస్టు మ్యాచ్‌లకు అలవాటు పడటానికి మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్‌లో లోపాలను అధిగమించడానికి భారత్‌తో టెస్టు వాళ్లకో పాఠం వంటిదని ఆయన పేర్కొన్నాడు.