YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అత్యంత ఖరీదైన దేశం బెర్ముడా..

అత్యంత ఖరీదైన దేశం బెర్ముడా..

-  అతి తక్కువ ఖర్చుతో జీవనం..

-  తొలిస్థానంలో దక్షిణాఫ్రికా.

112 దేశాల్లో సర్వే నిర్వహణ

 అతి తక్కువ ఖర్చుతో జీవించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 112 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత మన దేశం నిలిచింది. గోబ్యాంకింగ్ రేట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా దేశంగా బెర్ముడా నిలవడం గమనార్హం.  నాలుగు కీలకమైన అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సర్వేను నిర్వహించారు. కొనుగోలు శక్తి, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, వినియోగదారుల ధరలను పరిగణనలోకి తీసుకుని గోబ్యాంకింగ్ రేట్స్ ర్యాంకులను కేటాయించింది. ఇంటి అద్దెల విషయంలో నేపాల్ తర్వాత అతి తక్కువ భారతలోనేనని ఈ అధ్యయనంలో వెల్లడయ్యింది. వినియోగ ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలు భారత్‌లోనే అంత్యంత తక్కువని, కోల్‌కతా లాంటి మహానగరంలో  ఓ వ్యక్తి జీవించడానికి నెలకు సుమారు 285 డాలర్లు ఖర్చవుతోందని తెలిపింది.

మన కరెన్సీలో సుమారు రూ. 18 వేలు. భారత్ కొనుగోలు సామర్థ్యంలో 20.9 శాతం, అద్దెల విషయంలో 95.2 శాతం, నిత్యావసర వస్తువులు 74 శాతం, ఇతర ఉత్పత్తుల ధరలు సైతం 75 శాతం తక్కువని ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. కొలంబియా (13)తోపాటు పొరుగున ఉన్న పాకిస్థాన్ (14), నేపాల్ (28), బంగ్లాదేశ్ (40) కంటే చాలా చౌకగా జీవించేందుకు భారత్ అనుకూలంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. చాలా ఖరీదైన దేశాలను పరిశీలిస్తే ఘనా (108), స్విట్జర్లాండ్ (109), హాంగ్‌కాంగ్ (110), బహమాస్ (111), బెర్ముడా 112వ స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత చవకైన  50 దేశాలలో ఇంటి అద్దెలను న్యూయార్క్‌తో పోలిస్తే కనీసం 70 శాతం తక్కువ. నిత్యవసరాలు 40 శాతం, వినియోగ వస్తువలు 30 శాతం తక్కువ. ప్రపం చంలోనే అత్యధికంగా ప్లాటినమ్, బంగారం, క్రోమియం లాంటి విలువైన ఖనిజాలను ఉత్పత్తిచేసే దక్షిణాఫ్రికాలో కోనుగోలు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. ఇదే ఆ దేశం తొలిస్థానంలో నిలవడానికి కారణమైంది.

Related Posts