YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నార్సింగిలో మంత్రి పర్యటన

నార్సింగిలో మంత్రి పర్యటన
జిల్లాలోని  రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామి గౌడ్ సోమవారం పర్యటించారు. రూ. 35 లక్షలతో నిర్మించిన మార్కెట్ కమిటీ నూతన  భవనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక  ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ కుడా పాల్గోన్నారు. ఈ సందర్బంగా  మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో రైతు సంక్షేమం ప్రభుత్వం లక్షం.. రైతు బిడ్డగా, పక్షపాతిగా సీఎం కేసీఆర్ రైతాంగానికి అవసరమైన లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఎకరాకు రూ. 4 వేల పెట్టుబడులు ఇస్తున్నారుని అన్నారు.  కొత్తగా జిల్లాలో మూడు మార్కెట్ కమిటీ ల ఏర్పాటు చేశాం. ప్రతీ రైతుకు మద్దతు దరలు అందిస్తున్నం.  రూ. 12 వేల కోట్లతో పెట్టుబడులు అందించాం. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న  రైతు బీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో నూతన పరిశ్రమ ల స్థాపనకు మంత్రి కేటీఆర్ సహకారంతో హబ్ గా మారుస్తామని అయన అన్నారు. మండలి చైర్మన్  స్వామి గౌడ్ మాట్లాడుతూ  దక్షిణ భారత దేశం లో నార్సింగి పశువుల మార్కెట్ కు పేరుంది. నార్సింగి మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం.  వాతావరణం పడక, మారి పశులు ఇబ్బందులు పడుతూ పాల దిగుబడులు తగ్గుతున్నందున ఏసీ షెడ్ ల ఏర్పాటు కు మంత్రి హరీష్ రావు కు విన్నవించామని అన్నారు. గండిపేట - నాగోల్ మూసీ పరిసర పైప్ లైన్ మూసీ సుందరీకరణకు దోహదం చేస్తుంది.అలాగే, నార్సింగి లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కు కృషిచేస్తామిన అయన అన్నారు.

Related Posts