
అది దశాబ్దాల నాటి ఉన్న సమస్య. జూపార్క్ బహదూర్‌పురా, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్న వర్షానికే రోడ్లన్నీ చెరువులను తలపించేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ రూ. 1.20 కోట్లు మంజూరు చేశారు. దీంతో నవాబ్‌సాబ్ కుంటకు వెళ్లే నాలాలను600 ఎంఎం నుండి 1800 ఎంఎం వ్యాసార్థ్యంగా టన్నెలింగ్ టెక్నాలజితో రికార్డు సమయంలో ఈ మాసాంతంలోనే పూర్తి చేశారు. దీంతో బహదూర్‌పురా, జూపార్క్, సంజయ్‌గాంధీ నగర్ తదితర కాలనీల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. హైదరాబాద్ పాతబస్తీలో చిన్నపాటి వర్షం వస్తేనే బహదూర్‌పుర, సంయ్‌గాంధీ నగర్, జూపార్క్ పరిసర ప్రాంతాలు జలమయమవుతూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీనికి కారణం వర్షపునీరు సమీపంలోని నవాబ్‌సాబ్ కుంటకు వెళ్లే స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు అతితక్కువ విస్తీర్ణం 600ఎంఎం డయామీటర్‌తోనే ఉండేది. అయితే సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుండి ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రతినిధులు, స్థానికులు జీహెచ్ఎంసికి అనేక మార్లు విజ్ఞాపనలు పంపారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. దీంతో బహదూర్‌పురా, సంజయ్‌గాంధీ నగర్, జూపార్క్ పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు సులువుగా నవాబ్‌సాబ్ కుంటలో కలిసే డ్రెయిన్ల వ్యాసార్థం అతితక్కువగా ఉందని తేలింది. హైదరాబాద్‌లోని డ్రెయిన్లు కేవలం 2 సెంటీమటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నవాబ్‌సాబ్‌కుంటకు వెళ్లే డ్రెయిన్ 600 ఎంఎం డయా వ్యాసార్థంలో ఉండడంతో ముంపు పరిస్థితి పోవడానికి దీనిని గరిష్టంగా 1800 ఎంఎం వ్యాసార్థంగల ప్రత్యేక పైప్‌లైన్ వేయాలని, పరిసర ప్రాంతాల్లోని డ్రెయిన్లు కూడా పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని పెంచేందుకు కోటి 20 లక్షలతో అంచనాలు రూపొందించడంతో వెంటనే వాటిని కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి ఆమోదించారు. దీంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగం పనులను శరవేగంగా చేపట్టింది. ఏవిధమైన ఆస్తుల సేకరణ చేయకుండానే టన్నెలింగ్ టెక్నాలజితో నవాబ్‌సాబ్ కుంటకు గతంలో ఉన్న 600 ఎంఎం డయా పైప్ డ్రెయిన్‌ను 1800 ఎంఎం డయాకు పెంపొందించే పనులను ఈ వర్షాకాల సీజన్‌కు ముందే 2018 మే మాసాంతంలో పూర్తి చేశారు. గత రెండు వారాలుగా బహదూర్‌పురా తదితర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ నవాబ్‌సాబ్ కుంట డ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచినందున ఏవిధమైన ముంపుకు గురికాలేదు. ఎన్నో దశాబ్దాల తమ ప్రాంతాల ముంపు సమస్యకు పరిష్కారం చూపినందున సంజయ్‌గాంధీ నగర్, జూపార్కు, బహదూర్‌పురా పరిసర ప్రాంతాల వాసులు జీహెచ్ఎంసీ ఊరట లభించింది.