YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

హైదరాబాద్‌లో పీబీఎల్‌ మ్యాచ్‌

హైదరాబాద్‌లో పీబీఎల్‌ మ్యాచ్‌

హైదరాబాద్‌ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌

 హోరాహోరీ మ్యాచ్‌లతో అలరిస్తున్న పీబీఎల్‌-3 అంతిమ పోరాటాలకు హైదరాబాద్‌ వేదికగా నిలువనుంది.  గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 వరకు చివరి దశ లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా మూడు సెమీస్‌ స్థానాలు ఏ జట్లవో ఈ మ్యాచ్‌లతో తేలిపోనుంది. బుధవారం దిల్లీ డాషర్స్‌తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ జట్ల  తలపడతాయి.  గురువారం హైదరాబాద్‌ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌ తలపడతాయి. ఈనెల 12, 13 తేదీల్లో సెమీఫైనల్స్‌.. 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. మరోవైపు చెన్నైలో జరిగిన ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో అహ్మదాబాద్‌ స్మాషర్స్‌ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఆ జట్టు 5-0తో ముంబయి రాకెట్స్‌ను చిత్తుగా ఓడించింది.

Related Posts