YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీలో వెలుతురు వస్తే...ఆగిపోయే లైటింగ్

సిటీలో వెలుతురు వస్తే...ఆగిపోయే లైటింగ్
అరచేతిలోనే ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ సమాచారాన్ని తెలుసుకొనేలా దేశంలోనే మొదటిసారిగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం స్ట్రీట్ లైట్లలో ఎన్ని వెలుగుతున్నాయి? ఎంత విద్యుత్ వినియోగమవుతున్నది? మీ ప్రాంతంలో వీధి దీపాలు వెలుగుతున్నాయా? వంటి వివరాలు http://120.138.9.117:8080/ghmcలో తెలుసుకోవచ్చు. వెలుతురు రాగానే వాటికవే ఆరిపోతాయి. ఎవరైనా అక్రమంగా ఈ స్విచ్‌బోర్డ్‌ల ద్వారా వెలిగే లైట్లను ఆపివేయడం, లేదా ఉదయం వేళలో లైట్లను వేసేందుకు ప్రయత్నించినా, ఈ కంట్రోల్ స్విచ్‌బోర్డ్ డోర్‌ను తెరిచినా ఆ సమాచారం సంబంధిత విద్యుత్‌శాఖ ఏఈ లేదా డీఈకి వెంటనే అందుతుంది. ఈ లైట్లు వెలుగుతున్నాయా లేదా అనేది కమాండ్ కంట్రోల్ ద్వారా నేరుగా చూసి, సమీక్షించే అవకాశాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులతోపాటు స్థానికులు తెలుసుకొనేందుకు ప్రత్యేక లింక్‌ను కూడా అందిస్తారు. నగరంలోని మొత్తం లైట్లలో 98 శాతం వెలిగితేనే ఈఈఎస్‌ఎల్‌కు బిల్లులు చెల్లించేలా జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందం ప్రకారం తగు మొత్తంలో లైట్లు వెలుగకపొతే ఈఈఎస్‌ఎల్‌కు జరిమానా కూడా విధించే నిబంధనను కూడా పొందుపర్చారు.సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలను రికార్డుస్థాయిలో అమర్చడం ద్వారా జీహెచ్‌ఎంసీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ దీపాలను అమర్చడమే కాకుండా నిర్వహణను అత్యంత పారదర్శకంగా చేపట్టింది. అది కూడా మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని తెలుసుకునేలా చర్యలు చేపట్టింది.ఇప్పటి వరకు నగరంలో మొత్తం 4,07,392 వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చడం ద్వారా దేశంలోనే ఎల్‌ఈడీ ప్రాజెక్ట్‌ను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది. ప్రస్తుతం ఉన్న ఎల్‌ఈడీ లైట్లలో 4,06,729 స్ట్రీట్ లైట్లను సెంట్రలైజ్డ్ కంటోల్ మానిటరింగ్ సిస్టం (సీసీఎంఎస్) జీహెచ్‌ఎంసీ డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. దీంతో హైదరాబాద్‌లో ఎన్ని లైట్లు, ఎంత శాతం లైట్ల్లు వెలుగుతున్నాయనే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎల్‌ఈడీ లైట్లను అమర్చడం ద్వారా జూలై 2017 నుంచి ఏప్రిల్ 2018 వరకు రూ.48.70 కోట్ల విద్యుత్ బిల్లు ఆదా అయ్యింది. మొత్తంగా 6,97,64,511 యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. వీధి దీపాలతోపాటు జీహెచ్‌ఎంసీకి చెందిన ఉద్యానవనాలు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, శ్మశానవాటికల్లో కూడా ఎల్‌ఈడీ లైటింగ్ మార్పిడి ప్రక్రియ పురోగతిలో ఉన్నది. ఎల్‌ఈడీ బల్బుల ద్వారా ఏటా 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గుతుండగా, రూ.115.13 కోట్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతున్నది. దీంతోపాటు ఏటా 1,29,719 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కూడా తగ్గనున్నది. రూ.217.12 కోట్లతో చేపట్టిన ఎల్‌ఈడీ పాజెక్ట్ ద్వారా 55 శాతం విద్యుత్ ఆదా కానున్నది.

Related Posts