
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ, ఉద్యాన పంటలలో అనుసరిస్తున్న ఆధునిక పద్దతుల గురించి తెలుసుకోవడానికి నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన 25 మందితో కూడిన మేఘాలయ రైతుల బృందం మంగళవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసింది. ఈసందర్భంగా వ్యవసాయ రంగం, రైతుల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న పథకాలను, చర్యలను వివరించిన మంత్రి పొచారం. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, రూ. లక్షా యాబైవేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంట పెట్టుబడికై ఎకరాకు రూ. 8000 , రూ. 5 లక్షల రైతుభీమా, బారీ సభ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు, సూక్ష్మ బింధు సేద్యం, పాలీహౌస్ నిర్మాణానికి 75 శాతం సబ్సిడీ వంటి పథకాలను గురించి తెలియజేశారు. ఉధ్యాన శాఖ ఆద్వర్యంలో అధునాతన పద్దతిలో నిర్మించిన జీడిమెట్ల లోని సీవోఈ ని సందర్శించాలని సూచించారు. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రం దిక్చూచిగా మారుతుందన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉధ్యాన శాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.