
ధ్వని అనుకరణ సామ్రాట్ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.