
కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని అడిగేది పోయి 20,000 వేలు కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడగడమేంటని టీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అయన ఏన్టిఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కు ఒక్క ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. విభజన హామిలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. టీఆర్ఏస్ నేతల ధన దాహం బాగా పెరిగిందని అన్నారు.