YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాయి బ్రాహ్మాణులు అంటే చులకనా

నాయి బ్రాహ్మాణులు అంటే చులకనా
కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులపై సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగడం దుర్మార్గమన్నారు వైఎస్ జగన్. ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రతిపక్ష నేత.. సీఎం తీరుపై మండిపడ్డారు. ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందాలి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయా. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం దారుణం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ.. ఏదో దేవుడిచ్చిన వరమైనట్లుగా చంద్రబాబుగారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది’అని వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అంటే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం. దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం’ అని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత. నాలుగు రోజులు పాటూ నాయీ బ్రాహ్మణులు సమ్మె చేశారు. నెలకు రూ.15 వేల వేతనంతో పాటూ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి సమ్మెతో భక్తులు ఇబ్బందులు పడటంతో.. డిప్యూటీ సీఎం చర్చలకు ఆహ్వానించారు. టిక్కెట్‌పై రూ.20 ఇస్తామని.. మిగిలిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పినా.. జేఏసీ నేతలు ఒప్పుకోలేదు. సెక్రటేరియెట్ దగ్గర భారీగా గుమ్మి గూడారు. చర్చలకు పిలిచి అవమానించారని.. సమ్మెను మరింత తధృతం చేస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు అక్కడున్ను సమయంలోనే సీఎం కాన్వాయ్ వచ్చింది. జనాల గుంపును చూసి చంద్రబాబు.. కారు ఆపి దిగి వచ్చారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోబోగా సీఎం ఆపారుజ టిక్కెట్‌కు రూ.25 ఇస్తామని చెప్పారు. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. గౌరవ వేతనం, పెన్షన్ ఇవ్వాలని అడిగారు. చంద్రబాబు మాత్రం ససేమీరా అన్నారు. కొందరు నాయీ బ్రాహ్మణులు వాగ్వాదానికి దిగగా.. వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం ఉంటే వెదుక్కుంటూ వస్తా.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ వెళ్లిపోయారు. ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.

Related Posts