
తెలంగాణ పీసిసి ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర కు చెక్ పడిందా...! హై కమాండ్ పీసిసి బస్సు యాత్ర కు విరామం ఇవ్వాలని చెప్పిందా..?దీంతో నాలుగో విడుత బస్సు యాత్ర కు బ్రేక్ పడిన్నట్లేనా...? ఇంతకీ బస్సుయాత్ర పై కాంగ్రెస్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది..తెలంగాణ పీసిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న... ప్రజా చైతన్య బస్సు యాత్ర మొదలుకు బ్రేక్ పడనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.....పీసిసి ఇప్పటికే మూడు విడతల్లో 38 నియోజకవర్గాలను చుట్టొచ్చారు.ఐతే మొదటివిడత సక్సెస్ పుల్ గానే పూర్తి చేసుకున్నారు..రెండో, మూడో విడత యాత్ర లో వర్గ పోరు కనిపించింది...కొన్ని చోట్ల అభ్యర్థుల పేర్లు ప్రకటించడం...సిఏం గా ప్రకటనలు చేయించుకోవడంతో...వివాదం తీవ్ర స్థాయికి చేరింది. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య అంతర్గత పోరు బయిటపడింది. ..దీంతో 119 38 నియోజకవర్గాల్లో ఇప్పటికి మాత్రమే పూర్తయింది ..ఇంకా81 నియోజకవర్గాలు మిగిలివున్నాయి. వీటిని పక్కా ప్లానింగ్ తో చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.కానీ ఇప్పుడు బస్సు యాత్రే బ్రేక్ పడేలా ఉండనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది... ఇటీవలే పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రోజులు ఢిల్లీ లో కి వెళ్ళి వచ్చారు..ఈ పర్యటనలో ఉత్తమ్ రాహుల్ తో భేటీ అయ్యారు...ఐతే రాహుల్ బస్సుయాత్ర కంటే ముఖ్యంగా శక్తీ యాప్ ను ఎక్కువ మందికి చేరువ చేయాలని ఆదేశించినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. తెలంగాణాలో 30వేల 600 ల బూత్ కమీటీ లను నియమించాలని...నాలుగున్నర లక్షల మంది బూత్ కమిటీ సైనికులను తయారు చేయాలనీ రాహుల్ చెప్పుకొచ్చినట్లు తెలిపారు.స్వయానా ఉత్తమ్....రాహుల్ ఇదే చెప్పారని..ముందుగా ఇది పూర్తి చేసుకొని తర్వాత మిగితా కార్యక్రమాలకు వెళ్ళాలని చెప్పుకొచ్చిన్నట్లు చెప్పడంతో పార్టీ వర్గాల్లో బస్సు యాత్ర కొనసాగింపు పై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ఐతే నాలుగో విడుత బస్సు యాత్ర ఈ నెల 18 నుండి మొదలు పెట్టాలని ముందుగా పీసీసీ భావించినట్లు సమాచారం..కానీ ఉత్తమ్ ఢిల్లీ పర్యటన అనంతరం బస్సు యాత్ర షెడ్యూల్ లేదని తేలడంతో.. బస్సు యాత్ర పై పార్టీ శ్రేణులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.