YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తుకారం గేట్ రబ్ పనులు త్వరగా ప్రారంభించండి అధికారులకు మంత్రి పద్మారావు ఆదేశం

తుకారం గేట్ రబ్  పనులు త్వరగా ప్రారంభించండి       అధికారులకు మంత్రి పద్మారావు ఆదేశం
లాలాగూడ రైల్వే గేట్ వద్ద రబ్  నిర్మాణం పనులను సాధ్య మైనంత త్వరగా ప్రారంభించి ప్రజల ఇబ్బందులను నివారించాలని రాష్ట్ర మంత్రి టీపద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. రబ్  నిర్మాణం పై నామాలగుండు లోని తన కార్యాలయం లో మంత్రి పద్మారావు మంగళవారం  ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.  నిజానికి దాదాపు రూ. 29.10 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ రబ్  నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.15.14    కోట్లు,  కేంద్ర రైల్వే శాఖ దాదాపు రూ.13.95   కోట్ల    మేరకు నిధులను వినియోగిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మంత్రి పద్మారావు ఇటీవల సంప్రదింపులు నిర్వహించగా, తమ శాఖ పరంగా టెండర్ల ఖరారు ప్రక్రియను పూర్తిచేశామని తెలియజేసారు. గేట్ ను ముసి వేస్తె  బస్సులు, వాహనాల రాక పోకలకు ప్రత్యామ్నాయ రహదారులు గుర్తించాల్సి వుంది. దాంతో మంత్రి పద్మారావు మంగళవారం ట్రాఫిక్, జిఎచ్ఎంసి, జలమండలి వంటి వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షను నిర్వహించారు. ప్రత్యామ్నాయ రహదారి పై తమ నివేదికను సిద్దం చేసినట్లు ట్రాఫిక్ఏసిపి వెంకట రమణ వివరించారు. జిఎచ్ఎంసి పరంగా పనులను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్స్ ఈ ఈ హరి కిశోరే మంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా రబ్  నిర్మాణాన్ని ప్రారంభించి స్థానికుల చిరకాల స్వప్నాన్ని నేరవేర్చనున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related Posts