YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30న అంతా మౌనం..

 30న అంతా మౌనం..

- అమరవీరుల కోసం రాకపోకలకు బ్రేక్‌.. నో హారన్‌

- ఉదయం 10.58 నుంచి 11 గంటల  వరకు  ఎక్కడివారక్కడే నిశ్శబ్దం

- మెమో నం 408,తేదీ 19.01.2018

దేశంకోసం.. మనకోసం.. ప్రాణాలర్పించిన అమరవీరులు వారు. ఆ త్యాగధనులను స్మరించుకునేందుకు ఒక్క రెండు నిమిషాలు నువ్వూ నేను, అందరం మౌనం పాటిద్దాం.. ఆ రెండు నిమిషాలు ఎక్కడివాహనాలు అక్కడే నిలిపేద్దాం.. హారన్లు ఆపేద్దాం.. అని ప్రభుత్వం పిలుపునిచ్చింది. 

ఈ అపూర్వఘట్టం ఈనెల 30న ఆవిష్కృతం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఆ రోజు ఉదయం 10.58 గంటల నుంచి 11 గంటల దాకా.. అంటే 2 నిమిషాలపాటు రాష్ట్రంలోని వాహనాల రాకపోకలన్నీ నిలిపివేస్తారు. ఆ సమయంలో వాహనాల ఇంజిన్లు ఆపివేయడంతోపాటు హారన్లు కూడా మోగించరు.

కార్యాలయాల్లో కార్యకలాపాలు ఆగిపోతాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు ప్రజలంతా ఆ 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్‌) ముఖ్యకార్యదర్శి అధర్‌ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts