YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన?

జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన?
జమ్ముకశ్మీర్‌లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిన నేపద్యం లో  గవర్నర్ పాలన విదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలనలోకి వెళ్లకుండా ఉండాలంటే అసెంబ్లీ మెజారిటీకి సరికొత్త సంకీర్ణం అవసరమౌతోంది. గవర్నర్ పాలనను తప్పించుకోవాలంటే పీడీపీ(పీపుల్స్ డెమోక్రటిక్ అలయెన్స్) ఎన్‌సీ(నేషనల్ కాంగ్రెస్) పొత్తే తక్షణ పరిష్కారంగా అగుపిస్తోంది. గతానుభవాల దృష్ట్యా మోహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా ఏ మేరకు కలిసి వెళ్తారనేది వేచి చూడాల్సిన అంశమే. గతంలో జమ్ముకశ్మీర్ ఏడుసార్లు రాష్ట్రపతి పాలనను ఎదుర్కొంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 87 మంది. ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు44 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం పీడీపీకి 28మంది, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 ఇతరులు 7 మంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్‌లో ఏం జరగొచ్చో ఓసారి చూద్దాం..
స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ చేతులు కలపాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ మాత్రం తాము పీడీపీతో చేతులు కలపబోమని స్పష్టంచేసింది. ఇక పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంది. లేదంటే పీడీపీ తన మైనార్టీ ప్రభుత్వాన్ని ఇలాగా కొనసాగించాలంటే.. విశ్వాస పరీక్ష సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, ఇతరులు ఓటింగ్‌కు దూరంగా ఉండాలి. ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోతే.. అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన విధిస్తారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే ఇది ఎనిమిదవసారి అవనుంది. సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన క్రమంలో జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన వివరాలిలా ఉన్నాయి. 26 మార్చి 1977 నుంచి 9 జులై  1977..105 రోజుల పాటు.. కాంగ్రెస్ పార్టీ తన మద్దతు ఉపసహరించుకోవడంతో షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 6మార్చి 1986నుంచి 7 నవంబర్ 1986 246 రోజులు.. శాసనసభలో బలనిరూపణలో విఫలమైన కారణంగా 19జనవరి 1990 నుంచి 9 అక్టోబర్ 1996 శాంతి భద్రతలు క్షీణించిన కారణంగా ఆరు సంవత్సరాల 264 రోజుల పాటు..18అక్టోబర్ 2002నుంచి 2నవంబర్, 2002 రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో నిర్ణయం తీసుకోని కారణంగా 15రోజుల పాటు 11 జులై, 2008 నుంచి 5 జనవరి, 2009 178 రోజుల పాటు.. అమర్‌నాథ్ యాత్రికుల సౌకర్యార్థం భూ బదాలింపు విషయంలో సీఎం గులాం నబీ ఆజాద్ తీసుకున్న నిర్ణయంతో పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది.9 జనవరి 2015నుంచి 1 మార్చి 2015..51 రోజుల పాటు.. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, పీడీపీలు అవగాహనకు రావడంలో విఫలమైన కారణంగా గవర్నర్ పాలనను విధించారు. 

Related Posts