YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో 3,500 కిలో మీటర్ల ప్లాంటేషన్

తెలంగాణలో 3,500 కిలో మీటర్ల  ప్లాంటేషన్
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో హరిత హరం కార్యక్రమాన్ని మరింత స్పీడ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై క్షేత్ర స్ధాయిలో ఎక్కడికక్కడ ప్రజా ప్రతనిధులు భాగస్వామ్యులు కావాలని స్వయంగా సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచారు. అయితే త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే దానికంటే ముందే ముందుగా తెలంగాణ వ్యాప్తంగా రోడ్లను హరిత వనాలుగా మార్చే కార్యక్రమంలో అటవీశాఖ భాగస్వామ్యం అయింది.రాష్ట్రంలో ఏ రోడ్డు వెంట ప్రయాణం చేసినా, రోడ్డుకిరువైపులా పచ్చదనం, పూలమొక్కలతో కళకళలాడాలని, ఒక వనంలో ప్రయాణించిన అనుభూతి ఉండాలని సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఆ తరహాలోనే రోడ్లను నందనవనాల్లా తీర్చి దిచ్చే ప్రయత్నాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా అటవీ శాఖ చేపట్టింది. తెలంగాణలో 52 అటవీ డివిజన్లలో ఒక్కో ప్రాంతానికి 10 కిలో మీటర్లకు తక్కువ కాకుండా రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్‌ను ఈ యేడాదిలో తొలి విడతగా అటవీ శాఖ అధికారులు చేపట్టారు. అయితే ఈ ఎవెన్యూ ప్లాంటెషన్ ద్వారా పెట్టిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకోవటం ఈ సారి ప్లాంటేషన్ ప్రత్యేకత. ఎండాకాలంలోనే ఈ ప్లాంటేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన అధికారులు,.జూన్ నెలలో పనులను ముమ్మరం చేశారు. ఈ సారి అవెన్యూ ప్లాంటేషన్‌కు కొత్త టెక్నిక్‌ను అందుబాటులోకి తెచ్చారు. గుంత తీయడం దగ్గర నుంచి,.మొక్క చుట్టూ వర్మీ కంపోస్ట్, ఎరువు వేయటం, నాటిన మొక్క నిటారుగా పెరిగేందుకు సపోర్ట్ స్టిక్‌తో పాటు ప్రతీ మొక్కకు ట్రీ గార్డును కూడా ఒకే సారి ఏర్పాటు చేయటం ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేకత. ఈయేడాది తెలంగాణ వ్యాప్తంగా 3,500 కిలో మీటర్ల మేర ఈ తరహా ప్లాంటేషన్ చేయాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా సుమారు 500కిలో మీటర్ల పరిధిలో ప్రారంభమైన పనులు కొనసాగుతున్నాయి. మర్రి, రావి, వేప, గానుగ, చైనా బాదమ్, రెయిటీ ట్రీ లాంటి నీడను ఇచ్చే చెట్లతో పాటు రంగు రంగుల పూలతో, కాలానుగుణంగా పూసి అందంగా కనిపించే గుల్ మొహర్, తబూబియా, బహూనియా, అవలాండియా, టెకోమా, పెల్టా ఫోరమ్ రకాలను రోడ్ల వెంట నాటుతున్నారు

Related Posts