
హమ్మయ్యా... పుస్తక గోదాముకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. పాఠ్యపుస్తకాలు గోదాముకు వచ్చినా వాటిని నిర్దేశిత మండలాలకు పంపేందుకు తగినన్ని బస్సులు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు చొరవ చూపలేదు. కేవలం ఒక బస్సును మాత్రమే సమకూర్చారు. ఈ నేపథ్యంలో 45,968 పుస్తకాలను పామిడి, అనంతపురం, శింగనమల, బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాలకు మాత్రమే సరఫరా చేశారు. పుస్తకాలు నిల్వ ఉన్నా కూడా సరఫరా చేయలేని దుస్థితి అనంతపురం గుత్తి రోడ్డులో ఉన్న పుస్తక గోదాముకు సోమవారమే వివిధ రకాల టైటిల్స్ వచ్చాయి. సంబంధిత అధికారులు పుస్తకాలను మండలాలకు పంపే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పుస్తకాల సరఫరాలో జాప్యం.. వరుస సెలవుల అనంతరం సోమవారం నుంచి పిల్లలు ఎక్కువ మంది హాజరై తరగతులు ఊపందుకొనే తరుణంలో పుస్తకాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈక్రమంలో సోమవారం ఒక్క రోజే అనంతపురం జిల్లాకు ఒకే రోజు 1,51,307 పుస్తకాలు గోదాముకు చేరాయి. బుధవారం వచ్చిన పుస్తకాలు.. గతంలో ఉన్నవి మొత్తం కలిపి పుస్తక గోదాములో ఇంకా 2,80,268 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. తగిన వాహనాలు సమకూర్చి ఉంటే గోదాములో నిల్వ ఉన్న పుస్తకాలు పంపిణీ చేయడానికి వీలుండేది. ఇప్పటి దాకా జిల్లాకు 6,70,339 పుస్తకాలు వచ్చాయి. ఇంకా జిల్లాకు 16 లక్షలకు పైగా అందాల్సి ఉంది. అయితే నిల్వ ఉన్న పుస్తకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా పంపిణీ చేసేలా అధికారులు మరింతగా దృష్టి సారించాల్సి ఉంది.