
మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి తనకు ప్రాణ హాని ఉందని, లైసెన్స్ తుపాకీ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్‌డ్ తుపాకీ లేదా రివాల్వర్ ఇప్పించాలి’ అని కోరినట్లు సాక్షి తెలిపింది. 2006లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా తుపాకీ కోసం అప్లై చేయగా 9ఎమ్‌ఎమ్ గన్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు.