
వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి గుండెనొప్పి రావటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని మాక్స్ క్యూర్ హాస్పిటల్ కు తరలించారు. ఎంపీ హాస్పిటల్ లో చేరిన విషయం తెలుసుకున్న తెరాస నాయకులు, కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్ కి వెళ్లి పరామర్శించారు, ఇందులో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మర్రి యాదవ రెడ్డి, పార్టీ నేతలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎంపి త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.