YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ వ్యవసాయరంగానికి ఇండియాటుడే అవార్డు మంత్రి పోచారంకు సహచర మంత్రుల ప్రశంసలు

తెలంగాణ వ్యవసాయరంగానికి ఇండియాటుడే అవార్డు         మంత్రి పోచారంకు సహచర మంత్రుల ప్రశంసలు
 వ్యవసాయ రంగంలో  దేశంలోనే అత్యంత వేగవంతంగా  అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాసరెడ్డికి మరియు వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర గిరిజనాభివృద్ధి. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగమించడంలో,  తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవడంలో సహచర మంత్రి పోచారం ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి చందూలాల్ కొనియాడారు.  దేశ వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కేటగిరీలో  తెలంగాణ ఇండియాటుడే అవార్డు సాధించడం  నిజంగా గర్వకారణం అని మంత్రి చందూలాల్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు వ్యవసాయాన్ని దండగలా చేస్తే స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని  పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ , మంత్రి పోచారంలదే అని అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రారాజును చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు మంత్రి పోచారం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి చందూలాల్  కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధుకింద ఎకరానికి రూ.8000/-  పంట పెట్టుబడి సాయం, రైతన్నలకు పాసుబుక్కులు, రైతు బీమా లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించబోతున్నాయని,  సాగునీరు, కోతలు లేని 24 గంటల విద్యుత్, విత్తనాల, ఎరువుల కొరత లేకుండా చేయడం కేవలం ఒక్క సీఎం కేసీఆర్‌ హయాంలోనే జరిగిందని. మంత్రి చందూలాల్ చెప్పారు. ఇండియా టుడే అవార్డు స్ఫూర్తితో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, మంత్రి పోచారం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యవసాయ రంగం మరింతగా పురోగమించడం ఖాయమని, సస్యశ్యామల తెలంగాణ సాకారమవుతుందని మంత్రి చందూలాల్ అన్నారు.

Related Posts