YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఐపీఎల్ వేలంలో ముద్దుగుమ్మ..

 ఐపీఎల్ వేలంలో  ముద్దుగుమ్మ..

- బాలీవుడ్ బ్యూటీ జూహీచావ్లా గారాల పట్టి

- అందరినీ తనవైపు తిప్పుకొంది ఈ చిన్నది

ఐపీఎల్ 11వ సీజన్‌కు గానీ వేలం ప్రక్రియ పూర్తైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు సాగిన ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ రేటుకు అమ్ముడుపోగా.. మరికొందరు మాత్రం చాలా తక్కువ రేటు పలికారు. ఇదంతా పక్కన పెడితే ఈ వేలంలో బాగా అనుభవం ఉన్న పెద్దలతో కలిసి పాల్గొని అందరినీ తనవైపు తిప్పుకొంది ఓ పదిహేడేళ్ల చిన్నది. దీంతో ఈ అమ్మడు ఎవరబ్బా అని అందరూ ఆరాలు తీయడం ప్రారంభించారు.

ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ జూహీచావ్లా గారాల పట్టి జాన్వి మెహతా. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌తో కలిసి జూహీచావ్లా కోల్‌కతా నైట్స్ రైడర్స్‌కు యజమానురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ టీంలో ఈ చిన్నది కూడా భాగస్వామ్యం కాబోతుందట. అందుకే ఈ వేలంలో పాల్గొందట జాన్వీ. ప్రస్తుతం లండన్‌లో విద్యనభ్యసిస్తోన్న జాన్వి వేలం అనంతరం మాట్లాడుతూ క్రిస్ లిన్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. మరి ఈ ఐపీఎల్‌లో షారూక్, తన తల్లి జూహీతో కలిసి జాన్వీ కూడా సందడి చేయనుందేమో చూడాలి.

Related Posts