
ప్రపంచ యోగా దినం సందర్బంగా ఆయుష్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో యోగా కార్యక్రమం జరిగింది.యోగా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ జ్యోతి ప్రజ్వల చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి మాండవీయ, మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంఎల్ఏ గాంధీ, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఇతరులు పాల్గోన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయుష్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి లో యోగా కార్యక్రమం చేస్తున్నాం. ఆరోగ్య తెలంగాణ నిర్మాణ దిశగా ముందుకెళ్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో యోగా ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. యోగా డే ని అంతర్జాతీయంగా జరుపుకోవడం మనకు గర్వకారణం. ప్రతీ రోగానికి మందులు వాడకుండా యోగసనాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యోగా ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ అందరు తమ హెల్త్ పై దృష్టి పెట్టాలి. యోగా ద్వారా రోగాలను దూరంగా ఉంచొచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం యూత్ జిమ్ ల వైపు వెళ్తున్నారు.. కానీ యోగా ని అలవాటు చేసుకోవాలి. యోగా తో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి మాండవీయ ప్రసంగిస్తూ యోగా ప్రాచీన చికిత్స వ్యవస్థ. బీపీ, డయాబెటిస్, డిప్రెషన్ వంటి దీర్ఘకాలిక రోగాలను యోగా ద్వారా కంట్రోల్ చేయవచ్చని అన్నారు. ప్రపంచం ఇండియా వైపు చూస్తుంది. మన దేశం ప్రపంచానికి యోగా ని పరిచయం చేసిందని అన్నారు.