
జులై 17న ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. అమ్మవారి కల్యాణోత్సవానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జులై 18న ఎల్లమ్మ అమ్మవారి ఊరేగింపు రథోత్సవం ఉంటుందని చెప్పారు. రథోత్సవానికి పురవీధుల్లో సుందరీకరణ పనులు చేపడుతామని పేర్కొన్నారు.