YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న సెక్స్ రాకెట్

 రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న సెక్స్ రాకెట్
తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్‌లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్‌ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రెసిడెంట్‌ వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్‌కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్‌ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది.

Related Posts