YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

డివైడ్ టాక్ రావడంతో జగ్గా జాసూస్

డివైడ్ టాక్ రావడంతో జగ్గా జాసూస్
గత ఏడాదిలో వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో ఫెయిల్యూర్స్‌గా నిలిచిన వాటిలో ఒకటి ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, కత్రినాకైఫ్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అనేక వాయిదాలతో విడుదల అయ్యింది. ఎవరిగ్రీన్ అనిపించుకునే డిటెక్టివ్ సబ్జెక్ట్‌తో వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మాత్రం విఫలమైంది ఈ సినిమా. వాయిదాలే దెబ్బతీశాయో.. లేక కథలో సత్తా లేక ఫెయిల్ అయ్యిందో కానీ.. ఆల్మోస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది ఈ సినిమా. ఒక సినిమా ఫెయిల్ అయితే దాని హీరోకి నిరాశే. అయితే జగ్గా జాసూప్ ఫెయిల్ కావడం హీరోగానే కాదు, నిర్మాతగా కూడా తను భారీగానే నష్టపోయానని చెబుతున్నాడు రణ్‌బీర్ కపూర్. ప్రస్తుతం ‘సంజూ’ ప్రచార పనుల్లో ఉన్న ఈ హీరో.. జగ్గా అనుభవాన్ని వివరించాడు. ఆ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు రణ్‌బీర్. ముగ్గురు నిర్మాతల్లో ఈ హీరో కూడా ఒకరు. తొలి షో నుంచినే డివైట్ టాక్ పొందింది ఆ సినిమా. నెగిటివ్ రివ్యూలు జగ్గా జాసూస్‌ను దెబ్బతీశాయి. ఆ సినిమాతో ఎంత నష్టం వచ్చిందో చెప్పలేదు కానీ, తను నష్టపోయానని మాత్రం రణ్‌బీర్ చెప్పుకున్నాడు. ఆ సినిమా తనకు ఒక పీడకల అని, ఆర్థికంగా తనను దెబ్బతీసిందని రణ్‌బీర్ వివరించాడు

Related Posts