YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మిడ్ మానేరు పై మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

మిడ్ మానేరు పై మంత్రి హరీష్ రావు  వీడియో కాన్ఫరెన్స్
గతేడాదిలో మిడ్ మానేరులో 5టీఎంసీల నీరు నింపామని, ఈఏడాది 25 టీఎంసీల నీరు నింపే అవకాశముందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.  సచివాలయంలో మిడ్ మానేరుపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఈఎన్సీ హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కింద ప్రత్యక్షంగా 76 వేల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. గేట్లన్నింటినీ ఆపరేషనలైజ్ చేసి సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ఫ్లడ్కంట్రోల్ రూం పనులపై ఆరా తీసిన మంత్రి. పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ప్యాకేజీల వారీగా పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. లింక్ కెనాల్ లో అక్విడక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లింక్  కెనాల్ పనులను వేగంగా పూర్తి చేయాలని గుత్తేదారులతో  ఫోన్లో మాట్లాడారు. వంద మంది లేబర్ ను పెట్టి పనులు వేగంగా చేయాలని సూచించారు. మిడ్ మానేరు ద్వారా ఎన్ని చెరువులు నింపవచ్చో ఆ వివరాలు పంపాలి. చుక్క నీరు వ్యర్థం కాకుండా చెరువుల ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. మిడ్ మానేరు పునరావాస చర్యల కోసం 33 కోట్లకు ఆధరైజేషన్ పెండింగ్ ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. ఇప్పటి కప్పుడు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి ఆధరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి  ఆ  కాలనీలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

Related Posts