YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జర్నలిస్ట్ కుటుంబం ఆత్మహత్య పై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి జర్నలిస్ట్ మృతి పట్ల సంతాప ప్రకటించిన మంత్రి హరీష్ రావు

జర్నలిస్ట్ కుటుంబం ఆత్మహత్య పై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి జర్నలిస్ట్ మృతి పట్ల సంతాప ప్రకటించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం  ఆంధ్రభూమి విలేకరి హనుమంతరావు  మృతి పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. కుటంబం ఆత్మహత్య చేసుకోవటం చాలా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఒక విలువల కలిగిన వృత్తిలో ఉంటూ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడం విచారకరం అని... యువ జర్నలిస్ట్ గా  సేవాలందించారని అలాంటి జర్నలిస్ట్ ని కోల్పోవటం బాధాకరమన్నారు..ప్రభుత్వం జర్నలిస్ ల సంక్షేమానికి కృషి చేస్తుందని.. ప్రభుత్వం పక్షాన కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు. ఒక విలువలతో కూడిన వృత్తిలో ఉండి ఇలాంటి సంఘటనలకు పాల్పడటం మా మనస్సును చలించేలా చేసింది అని.. సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆత్మహత్యే దానికి పరిష్కారం కాదని ఆయన అన్నారు. జర్నలిస్ట్ లకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకరావలని ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దు అని కోరుకున్నారు. జర్నలిస్ట్, వారి పిల్లల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని వారి మృతి కి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబాని ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ భార్య కు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులను ఆదేశించారు.

Related Posts